‘కొండల్లో కోయిల పాటలు పాడాలీ…’ లాంటి అద్భుతమైన పాటలు రాసిన కవి ఆయన. ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనసున్న మనిషి ఆయన. ప్రకృతిలోని అందచందాలను అలతి అలతి పదాల్లో చిత్రిక పట్టిన సౌందర్య ప్రేమికుడు ఆయన. ఆయనే కవిగాయక వైతాళికుడు. జయరాజ్. కేవలం బాధలే కాదు, వాటిని పోగొట్టే పోరాటాల పదును కూడా ఆయనకు తెలుసు.
జయరాజ్ది కేవలం పాట మాత్రమే కాదు, ఆచరణలో రాటుదేలిన గొంతు కూడా. జయరాజ్ రాసిన దాదాపు 500 పాటల్లో 150కిపైగా పాటలు ఉద్యమానికి సంబంధించినవే కావడం గమనార్హం. లాఠీ దెబ్బల నుంచి జైలు వరకు సాగిన ఆ అపురూప గాయకుడి అంతరంగాన్ని హృద్యంగా ఆవిష్కరించి ఇంటర్వ్యూ ఇది.