అయ్యో.. గాయకుడు జస్టిస్ బీబర్‌కు పక్షవాతం - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో.. గాయకుడు జస్టిస్ బీబర్‌కు పక్షవాతం

June 11, 2022

అమెరికానే కాకుండా ప్రపంచం నలుమూలల్లోని సంగీత ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న దిగ్గజ యువ గాయకుడు జస్టిస్ బీబీర్ విషాద వార్త చెప్పాడు. తన ముఖానికి పక్షవాతం సోకిందని, కన్ను కూడా సరిగ్గా తెరవలేకపోతున్నానని తనకు 24 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించాడు. వ్యాధి కారణంగా వరల్డ్ టూర్ కచేరీలను రద్దు చేసుకుంటున్నానని తెలిపాడు. 28 ఏళ్ల బీబర్ ఫేసియల్ పెరాలసిస్‌తో బాధడుతున్నాడు. ‘చూస్తున్నారు కదా. ఈ కన్ను రెప్ప పడడం లేదు. ముఖంలో ఈ వైపు పక్షవాతం రావడంతోనవ్వలేకపోతున్నాను. ఇలా జరక్కపోయి ఉంటే బావుండేది. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాను. నేను ఏం చేయడానికి పుట్టానో ఆ పని పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నించి కోలుకుంటాను. దీనికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ముఖానికి సంబంధించిన కొన్ని ఎక్సర్‌సైజులు చేస్తున్నాను ’ అని బీబర్ చెప్పాడు. బీబీర్‌కు షింగ్లిస్ వైరల్ ఇన్ఫెక్షన్ సోకడంతో ముఖంలోని నరాలు దెబ్బతిన్నాయి. దీన్ని రామ్సే హంట్ సిండ్రోమ్‌ అంటారు. బీబర్‌‌ భార్య హేలీ కూడా ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. మెదడులో రక్తం గడ్డకట్టటంతో సర్జరీ చేశారు.