సింగర్ కేకే మృతిపై అనుమానాలు.. ముఖంపై గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

సింగర్ కేకే మృతిపై అనుమానాలు.. ముఖంపై గాయాలు

June 1, 2022

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కు తన గాత్రంతో ప్రాణం పోసిన కేకే (కృష్ణకుమార్ కున్నాత్ ) హఠాన్మరణంతో ఆయన అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. హిందీతోపాటు తెలుగు, తమిళ, మలయాళం, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఎంతో మంది హృదయాలను కదిలించారు కృష్ణకుమార్ కున్నాత్‌. కోల్‌కత్తాలో మంగళవారం రాత్రి ఒక కాన్సర్ట్‌లో ప్రదర్శన ఇస్తూ.. కేకే హఠాత్తుగా మరణించడంతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు, ఆ తర్వాత హోటల్‌ చేరుకున్న అనంతరం ఆయన కుప్పకూలిపోయాడని తెలియడంతో.. కేకేను రాత్రి 10.30 గంటల సమయంలో కలకత్తా మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CMRI)కి తరలించారు. అక్కడ వైద్యులు కేేకే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే, కేకే గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. పూర్తి కారణాలు తెలియరాలేదు. అయితే, కేకే మృతికి సంబంధించి మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. కేకే ఆసుపత్రికి చేరిన సమయంలో తల, ముఖంపై గాయం గుర్తులున్నట్లు సమాచారం. గాయం ఎలా అయిందో తెలియాల్సి ఉంది. గాయం కారణంగానే మృతి చెందారా? లేదంటే గుండెపోటుతో మృతి చెందారా? అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తేలిపోనున్నది. పోలీసులు ఇప్పటికే ఆయన మరణంపై కేసు నమోదు చేశారు. ఈవెంట్‌ నిర్వాహకులు, హోటల్ సిబ్బందిని పోలీసులు  విచారించే అవకాశం ఉంది.