పాట సరిగ్గా పాడలేదని హత్య 

రాజస్థాన్‌లో నేరాలు పెరిగిపోతున్నాయి. సంప్రదాయంగా పాడుతున్న పాటను సరిగ్గా పాడలేదని ముస్లిం జానపద గాయకుడిని ఓ హిందూ పూజారి హత్య చేశాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. 200 మంది ముస్లింలు ప్రాణభయంతో ఊరివిడిచి జైసల్మేర్‌కు  వెళ్లిపోయారు. పాక్ సరిహద్దులో ఉన్న దంతల్ గ్రామంలోఈ హత్య జరిగింది. గ్రామానికి చెందిన అమద్ ఖాన్ గ్రామ సంప్రదాయం ప్రకారం ముస్లిమే అయినా.. హిందువుల పండగలు పబ్బాల సమయంలో గుడిలో భక్తిపాటలు పాడుతుంటాడు. గత నెల 27 జరిగిన కార్యక్రమంలో అతడు ఓ హిందూ దేవతను ఉద్దేశించి పాట పాడాడు. అయితో పాటలో రాగాలు, పదాలు తప్పుగా దొర్లాయంటూ పూజారి రమేశ్‌ సుథార్‌ అతణ్ని అడ్డుకుని తిట్టాడు. అంతటితో ఊరుకోకుండా ఖాన్ వద్ద ఉన్న సంగీత పరికరాలను పగలగొట్టాడు. గొడవ రేగింది. రమేశ్‌ తన స్నేహితులతో కలిసి అహ్మద్‌ఖాన్‌ను హత్య చేశాడు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జైసల్మేర్ కు వెళ్లిన ముస్లింలు.. తాము గ్రామానికి తిరిగి రాలేమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రమేశ్‌ను అరెస్టు చేశారు. అతడి స్నేహితులు పరారీలో ఉన్నారు.  

SHARE