బాలు పరిస్థితి అత్యంత విషమం - MicTv.in - Telugu News
mictv telugu

బాలు పరిస్థితి అత్యంత విషమం

September 24, 2020

singer SP Balasubrahmanyam Health Update.

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమాణ్యానికి ఆగష్టు 5న కరోనా వైరస్ సోకింది. ఆయన గత 40 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ప్రతిరోజూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. అలాగే ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా సోషల్ మీడియా ద్వారా బాలు ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతున్నారు. 

కొన్ని రోజుల క్రితం వరకు బాలు చికిత్సకు బాగా స్పందిస్తున్నారని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వస్తున్నారు. అలాగే చరణ్ కూడా బాలు కోలుకుంటున్నారని తెలిపారు. కొన్ని రోజుల క్రితం వరకు బాలు ఎక్మో వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగుతోందని అన్నారు. బాలు కోమాలోకి వెళ్లి మళ్ళీ తిరిగివచ్చారని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం బాలు ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించిందని సమాచారం. ఈ మేరకు కాసేపట్లో బాలు ఆరోగ్యంపై డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోంది అనుకుంటున్న సమయంలో తిరిగి అస్వస్థతకు గురికావడం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది.