ప్రముఖ గాయని సునీత రెండేళ్ల క్రితం వ్యాపారవేత్త, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరిదీ ఒకే ప్రొఫెషన్ కావడంతో వీరిద్దరూ కలిసి వీరి సొంత బిజినెస్ లను చూసుకుంటున్నారు.అలాగే సునీత ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కూడా ఉండిపోయారు. ఇదిలా ఉండగా నెట్టింట ఆమె మళ్లీ తల్లి కాబోతుంది అని ఓ వార్త చక్కర్లు కోడుతుంది. ఈ విషయం పై తాజాగా సింగర్ సునీత స్పందించింది.
‘నేను ప్రెగ్నెంటా? ఆ విషయం నాకే తెలియదు. అలా రూమర్ పుట్టిస్తున్నారు అంటే వారి ఆలోచనా విధానానికే వదిలేస్తున్నా. వారు నన్ను, నా జీవితాన్ని ఏం చేయలేరు’ అని చెప్పుకొచ్చింది. ఇంతకుముందు ఇలాంటి వార్తలు రావడంతో .. ఏదేదో ఊహించుకొని ఇలాంటి రూమర్స్ ను స్ప్రెడ్ చేయడం ఆపండంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే సునీత తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయం కానున్నాడు. సర్కారు నౌకరి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్‌కే టెలీషో బ్యానర్‌పై కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు.