singer sunitha to do one minute music videos for instagram reels shares a video goes viral
mictv telugu

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ సునీత

August 28, 2022

స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సింగర్‌గానే కాకుండా రియాలిటీ షోల్లో జడ్జిగా చేస్తూ తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. సునీత పాటలతో పాటు తన అందంతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసిన వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.

సునీత ఇకపై తన అభిమానుల కోసం వన్ మినిట్ వీడియో ఇన్‌స్ట్రాగ్రామ్ రీల్ చేస్తానని అదిరిపోయే తీపికబురు అందించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. సునీత వెల్లడించిన విషయాలు ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలుగజేస్తోంది. 3,000కు పైగా పాటలు పాడిన సింగర్ సునీత రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. 19 సంవత్సరాల వయస్సులోనే సునీతకు పెళ్లి కాగా కొన్ని రీజన్స్ వల్ల మొదటి భర్తతో ఆమె విడిపోయారు. ఆ తర్వాత సునీత ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన రామ్ వీరపనేనిని గతేడాది పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.