ప్రముఖ గాయని వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని బేసంట్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలను అధికార లాంఛనలతో నిర్వహించారు. వేలాదిగా అభిమానులు తరలివచ్చి వాణీ జయరాంకు వీడ్కోలు పలికారు. అంతకుముందు ఆమె భౌతికకాయానికి వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు కడసారి నివాళులు అర్పించారు. సీఎం స్టాలిన్ కూడా స్వయంగా వెళ్లి ఆమె పార్థివదేహనికి సీఎం నివాళులర్పించారు.
శనివారం చెన్నైలోని స్వగృహంలో 78 ఏళ్ల వాణీ జయరాం తుదిశ్వాస విడిచారు. పనిమనిషి ఆమె ఇంటికి రాగా, ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో, వాణీ జయరాం సోదరికి సమాచారం అందించారు. వారు ఇంట్లోకి ప్రవేశించి చూడగా, వాణీ జయరాం బెడ్ రూంలో విగతజీవురాలిగా పడి ఉన్నారు. ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.వాణీ జయరాం భర్త జయరాం 2018లో మరణించారు. అప్పటినుంచి ఆమె తమ నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. 50 ఏళ్ళ సినీరంగంలో ఆమె 10 వేల పాటలకు పైగా పాడి అలరించారు.