ప్రముఖ గాయని వాణీ జయరాంది అనుమానాస్పద మృతి అని పోలీసులు భావిస్తున్నారు. ఆమె నుదిటిపై నెత్తుటి గాయాలు ఉన్నాయని, ఆ స్థితిలోనే ఆస్పత్రికి తరలించామని బంధువులు చెబుతున్నారు. చెన్నై సినీ మీడియా వార్తల ప్రకారం.. వాణీ జయరాం చనిపోయినప్పుడు ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. బయటికి వెళ్లిన కుటుంబసభ్యులు తిరిగి వచ్చి తలుపు తట్టారు. ఆమె ఎంతసేపటికీ తలుపు తీయలేదు. దీంతో తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. వాణి రక్తపు మడుగులో కనిపిపంచారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె గ్లాస్ టేబుల్‌పై పడిపోయి ఉండొచ్చుని చెబుతున్నారు. పోలీసులు వాణి ఇంటిని స్వాధీనం చేసుకుని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. 78 ఏళ్ల వాణి మరణంతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తదతర సినీరంగాల ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి :
జూ.ఎన్టీఆర్‌తో లాభం లేదు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
వారసుడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న..? వెంట బాలకృష్ణ కూడా..