singers hemachandra, sravana bhargavi couple reacts on divorce rumors posts viral
mictv telugu

విడాకులపై స్పందించిన హేమచంద్ర, శ్రావణ భార్గవి

June 29, 2022

singers hemachandra, sravana bhargavi couple reacts on divorce rumors posts viral

స్టార్ సింగింగ్ కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇష్యూపై ఇప్పటి వరకూ మౌనంగా భరిస్తూ వచ్చిన జంట ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

ఈ మేరకు శ్రావణ భార్గవి ఇన్‌స్టాగ్రామ్ లో ‘సెపెరేట్ అవుతున్నామనే న్యూస్ వచ్చినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో పాటు యూట్యూబ్ వ్యూస్ పెరిగాయి. ఆదాయం కూడా పెరిగింది. తప్పో, ఒప్పో.. మీడియా వల్లే ఇదంతా జరిగిందని సైలెంట్ గా ఉన్నామని పోస్ట్ చేసింది.
https://www.instagram.com/p/CfWf9wFvSnC/?utm_source=ig_web_copy_linkఅటు హేమచంద్ర సైతం ‘తను పాడిన పాటల కంటే ఎక్కువ స్పీడ్ గా రూమర్స్ వ్యాప్తి చెందుతున్నాయని, జనాలు వాటిని పిచ్చిగా నమ్మి తమ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారని’ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి శ్రావణభార్గవిని ట్యాగ్ చేశాడు. విడిపోలేదనే అంశాన్ని ఇద్దరూ విడి విడిగా పోస్ట్ చేయటంతో కొంత మందిలో ఇంకా అనుమానం తొలగిపోలేదు. దీంతో ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉందన్నది వాస్తవం.