ఎవరూ డేటింగ్‌కు రావడం లేదని రోడ్డెక్కాడు.. రెస్పాన్స్ చూసి..  - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరూ డేటింగ్‌కు రావడం లేదని రోడ్డెక్కాడు.. రెస్పాన్స్ చూసి.. 

February 5, 2020

స్వీట్లు షాపుల్లో దొరకుతాయి. సినిమాలను థియేటర్లలో చూడొచ్చు. బట్టలను, నగలను షాపుల్లో కొంటారు. స్పా, మసాజ్, ఇంకా లైంగిక సుఖం వంటివి కూడా డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. కానీ ప్రేమ మాత్రం అంగట్లో దొరకదు. స్వచ్ఛమైన ప్రేమ కోసం అల్లాడుతున్న ఓ యువకుడు.. ఏళ్లపాటు వేచి చూసి ఇక ఇట్లయితే పని కాదనుకుని రోడ్డెక్కి బోర్డెక్కాడు. ప్రేమికుల దినం వాలెంటైన్స్‌ డే ముహూర్తం చేసుకుని మరీ ప్రేమ బిచ్చగాడి అవతారం ఎత్తేశాడు. 

బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కు చెందిన మార్క్ అనే యువకుడి ప్రేమగోల ఇది. అతడు చాలా మంది అమ్మాయిలన ట్రై చేశాడు. డేటింట్ యాప్స్ లలో జెల్లడ పట్టేశాడు. కానీ ఎవరూ అతనితో డేటింగ్‌కు రావడం లేదు. దీంతో.. చివరికి ఏకాకిలా జీవితం ముగిసిపోతుందని భయపడి సొంత ప్రచారం చేపట్టాడు. రూ. 40 వేలు ఖర్చు చేసి రద్దీ రోడ్డులో తన ఫొటోతో హోర్డింగ్ పెట్టించుకున్నాడు. ఓ వెబ్ సైట్ క్రియేట్ చేసి, దాని అడ్రసునూ అచ్చేశాడు. అంతటితో ఆగకుండా.. తన బాధ వెళ్లగక్కుతూ ట్వీట్లు కూడా పెడుతున్నాడు. తన హోర్డింగ్ ప్రయత్నం ఫలించిందని, ఇప్పటికి 1000 మంది సై అంటున్నారని చెబుతున్నాడు. తనలాంటి అదృష్టవంతుడు ఈ లోకం మరొకడుంటాడా అని గొప్పలు పోతున్నాడు. కథ ఇంటితో అయిపోయలేదు, అతనికి వచ్చిన ఆఫర్లలో సగం.. అంటే వెయ్యి మంది అబ్బాయిల నుంచి వచ్చాయట.