సింగపూర్‌లో ప్రజలందరికీ బోనస్.. మనకు మోదీ 15 లక్షలు ఎప్పుడిస్తారో? - MicTv.in - Telugu News
mictv telugu

సింగపూర్‌లో ప్రజలందరికీ బోనస్.. మనకు మోదీ 15 లక్షలు ఎప్పుడిస్తారో?

February 20, 2018

2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ.. తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెప్పించి అందరి ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున వేస్తామని ప్రకటించడం తెలిసిందే. తర్వాత ఆ హామీ అమలైందా లేదా అన్నది వేరే విషయం. ధనిక దేశం సింగపూర్ పాలకులు మాత్రం ఇలాంటి హామీలు ఇవ్వకపోయినా ప్రజలందరి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. తాజాగా అక్కడ ప్రజలందరికీ బోనస్ ప్రకటించారు.  తాజాఆర్థిక ఫలాలు అందరికీ అందాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు.21 ఏళ్లకు మించి వయసున్నవారందరికీ బోనస్ దక్కుతుంది. ఒక్కొక్కరికి సుమారు 300 సింగపూర్ డాలర్లు(దాదాపు రూ. 15వేలు) బోనస్‌గా అందనుంది. 2017 బడ్జెట్‌లో మిగిలిపోయిన 10 బిలియన్ల సింగపూర్ డాలర్లను ప్రభుత్వం బోనస్ గా ప్రజలకు పంచనున్నట్లు ఆర్థికమంత్రి హెంగ్ స్వీ కీట్ సోమవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. సింగపూర్ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలని సుదీర్ఘకాలంగా తమకున్న నిబద్ధతకు తాజా బోనస్ నిర్ణయం ఓ నిదర్శనమమన్నారు.

సింగపూర్‌లో ఇలాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జనానికి బోనస్ ఇస్తుంటారు. దీన్ని ‘హోంగ్‌బావో’ బోనస్‌గా పిలుస్తారు. ఈ ఏడాది ఆఖరు కల్లా మొత్తం  27 లక్షల మంది ఈ బోనస్‌ అందుకోనున్నారు. బోనస్ ను ప్రజల ఆదాయాన్ని బట్టి అందిస్తారు. వార్షికాదాయం 28 వేల (సింగపూర్) డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్న వారు 300 డాలర్ల బోనస్‌ వస్తుంది. 28,001-1,00,000 డాలర్ల మధ్య ఉన్న వారికి 200 డాలర్లు, 1,00,000 డాలర్ల పైన ఆదాయమున్న వారికి 100 డాలర్లు బోనస్‌ అందుతుంది. ఈ బోనస్ ప్రకటనపై సోషల్ మీడియాలో సైటర్లు వెల్లువెత్తున్నారు. మోదీ తమకు ఎప్పుడు రూ. 15 లక్షల బోనస్ వేస్తారో అని భారతీయ నెటిజన్లు అంటున్నారు. రూ. 15 లక్షలు కాకపోయినా సింగపూర్ సర్కారులా 15 వేలు వేసినా చాలని, కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటామని చెబుతున్నారు.