Home > Featured > సార్.. మా అమ్మను తెగ కొడుతుండు, వచ్చి కాపాడండి

సార్.. మా అమ్మను తెగ కొడుతుండు, వచ్చి కాపాడండి

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిభట్లలో నివాసముంటున్న ఓ ముగ్గురు చిన్నారులు పోలీసు స్టేషన్ కొచ్చి ‘సార్‌.. మా నాన్న బాగా తాగొచ్చి, రోజు మా అమ్మను తెగ కొడుతుండు. జర మీరే కాపాడాలి' అంటూ వేడుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు చిన్నారుల ఇంటికెళ్లి, భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

సీఐ నరేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.."నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పంతంగి రాజీవ్, పద్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నంకు చెందిన ఆదిభట్ల నివాసముంటున్నారు. ఈ దంపతులకు దీపు (10), శివరామకృ ష్ణ (7), లక్ష్మీకాంత్‌ (6) సంతానం. రాజీవ్‌ నిత్యం తాగొచ్చి పద్మను వేధించేవాడు. సోమవారం మధ్యాహ్నం భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. అడ్డొచ్చిన వృద్ధులైన పద్మ తల్లిదండ్రులపైనా చేయిచేసుకున్నాడు. వెంటనే ముగ్గురు పిల్లలు ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తండ్రిపై ఫిర్యాదు చేశారు."

Updated : 7 Jun 2022 4:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top