చెల్లెలికి చేనేత - అన్నకు హెల్మెట్.. ఈ రాఖీ స్పెషల్ ! - MicTv.in - Telugu News
mictv telugu

చెల్లెలికి చేనేత – అన్నకు హెల్మెట్.. ఈ రాఖీ స్పెషల్ !

August 7, 2017

ఈ అన్నా చెళ్ళెల్లిద్దరూ కలిసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకరు అన్నాతమ్ముళ్ళ విలువైన ప్రాణాలను కాపాడ్డానికి హెల్మెట్ అత్యవసరమని పిలుపునిస్తున్నారు. ఇంకొకరు ప్రోత్సాహం లేక మగ్గిపోతున్న మగ్గం బతుకులకు సొబగులు అద్దాలనుకుంటున్నారు, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటున్నారు. వాళ్ళే నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత, ఐటీ మంత్రి కేటీఆర్. రక్షా బంధన్ సందర్భంగా పక్షం రోజుల ముందు నుండే ‘ రక్షా బంధన్ – సిస్టర్ 4 చేంజ్ ’ అంటూ ఇచ్చిన పిలుపుకు చాలా మంది స్పందించారు. దేశ విదేశాల నుండి సైతం కవిత కన్సెప్టును మెచ్చుకొని ఫాలో అయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది యువత హెల్మెట్ లేని ఒకే ఒక్క కారణంగా తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. అలాంటి ప్రమాదాలను నివారించడానికి కవిత చూపించిన ప్రత్యాన్మాయం సిస్టర్ 4 చేంజ్.

ఎందరిలోనో స్ఫూర్తి నింపిన కవిత రక్షా బంధన్ సందర్భంగా అన్న కేటీఆర్ కు రాఖీ కట్టి హెల్మెట్ ను గిఫ్టుగా ఇచ్చారు. కేటీఆర్ కూడా కవితకు చేనేత పట్టుచీరను బహూకరించారు. ఇలా రక్షాబంధన్ వేడుకతో చేనేత దినోత్సవాన్ని కూడా సెలెబ్రేట్ చేస్కోవడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో చేనేతకు మునుపటి కళ తీసుకు రావాలని తెలంగాణ ప్రభుత్వం గట్టి కృషి చేస్తోందనే విషయం విధితమే. ఈ అన్నాచెళ్ళెళ్ళు తలచిన సంకల్పం నిజమైతే ఎందరికో ప్రాణం, జీవం వరమౌతుంది.