Sister who tied rakhi to Shila..If you know the real story..
mictv telugu

శిల్పానికి రాఖీ కట్టిన సోదరి..అసలు కథ తెలిస్తే కన్నీరు ఆగదు..

August 12, 2022

Sister who tied rakhi to Shila..If you know the real story..

రాఖీ పండగ అంటే అక్కలకు, చెల్లెలకు చెప్పలేనంత ఆనందం. తన సోదరులపై ఉన్న అంతులేని అనురాగాన్ని రాఖీ రూపంలో తోబుట్టువులు పంచుకుంటారు. దానికి అన్నదమ్ములు..’నీ కష్టసుఖాల్లో మేం అండగా ఉంటాం’ అని భరోసా ఇస్తారు అయితే, ఓ సోదరి శిల్పానికి రాఖీ కట్టిన సంఘటన ప్రస్తుతం కన్నీరు తెప్పిస్తుంది.

వివరాల్లోకి వెళ్తే..రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా జాట్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తించాడు. 24-09-2017న జమ్మూకశ్మీర్‌లో విధి నిర్వహణలో అమరుడయ్యాడు. అయితే, అతడి విగ్రహాన్ని, అతడు చేసిన దేశ సేవకు గుర్తుగా రాజస్థాన్‌లో విగ్రహాన్ని కట్టించారు. నేడు రాఖీ పండగ రావడంతో అతని సోదరి అతని చేతికి రాఖీని కట్టి, కన్నీరు మున్నీరు అయ్యింది.

”ఆ చిత్రంలో సైనికుడి దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న అతడు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా. సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రక్షాబంధన్ రోజున రాఖీ కట్టింది. అతడు దేశ సేవలో ప్రాణాలు అర్పించిన కద్వాస్రా. వీరత్వానికి గుర్తుగా రాజస్థాన్‌లో విగ్రహం ఏర్పాటు చేశారు. దానికి అతని సోదరీ రాఖీ కట్టి, కన్నీరు తెప్పించింది. ఇలాంటి సన్నివేశాలే భారత్‌ను అసాధారణంగా మారుస్తాయి. సోదరుడిని కోల్పోయిన బాధ, దేశం కోసం ప్రాణత్యాగం చేశాడనే గర్వం ఆమెను ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేనున్నాంటూ భరోసా ఇచ్చే ఆ సోదరుడి చేతికి రాఖీ కట్టలేక ఆమె మనసు అలజడికి గురైంది. ఆమెను ఆమె నియంత్రించుకుని విగ్రహ రూపంలో నిలిచిన అతడి చేతికే రాఖీ కట్టింది” అని వేదాంత్ బిర్లా అనే వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ, రాసుకొచ్చాడు.