లాటరీ వేసుకుని ఆత్మహత్యలు - MicTv.in - Telugu News
mictv telugu

లాటరీ వేసుకుని ఆత్మహత్యలు

October 27, 2017

ఆ అక్కచెల్లెళ్లకు ఏ కష్టం మోచ్చిందో  ఏమో  తెలియదు కాని చనిపోవాలని నిర్ణయించుకున్నారు.  నిర్ణయం తీసుకున్నాక  ఎలా చనిపోవాలో అర్థం కాక  చనిపోవటానికి  చీటీలు వేసుకున్నారు.

అందులో.. ‘గోదావరిలో దూకి చనిపోవాలి’, ‘విషం తీసుకుని చనిపోవాలి’, ‘ఉరి వేసుకుని చనిపోవాలి’ అని  రాసుకున్నారు. ఈ మూడు  చీటీలు వేసి..అందులో ఒక దాన్ని ఎంపిక చేసుకున్నారు. అందులో  ‘ఉరి వేసుకుని’ అని  వుండటం తో  అలాగే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయాన్ని కలచివేసే సంఘటన రాజమండ్రిలో జరిగింది, మృతులు మల్లికార్జున నగర్‌లో నివసించే నాగేశ్వరరావు కుమార్తెలు అనంతలక్ష్మి(25), అరుణకుమారి(22). పెళ్లి చేసుకోవాలంటూ  మేనమామ ఉమామహేశ్వర రావు తెస్తున్న ఒత్తిడి వల్లే వీరు చనిపోయారని  స్థానికులు అనుకుంటున్నారు .