కేసీఆర్ ఇంట పండుగ సందడి.. రాఖీ కట్టిన నలుగురు సిస్టర్స్
రాఖీ పర్వ దినాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన నలుగురు సోదరీమణులు ఒకరి తర్వాత మరొకరు రాఖీ కట్టారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అతని సోదరి అలేఖ్య రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, కోడలు, మనవడు, మనవరాలు పాల్గొన్నారు.
అటు హిమాన్షుకు ప్రగతి భవన్‌లో పనిచేసే మహిళా సిబ్బంది కూడా రాఖీలు కట్టగా వాటిని పోస్ట్ చేసి హ్యాపీ రక్షా బంధన్ అని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ మేరకు తీసిన వీడియోను ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక ఖాతా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మరో కార్యక్రమంలో తెలంగాణ మునిసిపల్, ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.
రాఖీ పండుగ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి రాఖీ కట్టిన ఆయన సోదరీమణులు.#RakshaBandhan pic.twitter.com/CSw2PWCjAU
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2022