ఇప్పుడు ఛార్మీ వంతు ఏం తేలుస్తారో చూడాలి !
డ్రగ్స్ కేసులో భాగంగా గత కొంత కాలంగా సిట్ విచారణకి హీరోయిన్ ఛార్మి వస్తుందా, లేదా ? అనే సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు ఇవాళ సిట్ కార్యాలయానికి విచారణకు హాజరైంది. అయితే ఛార్మీ వెంట బౌన్సర్లు కూడా వచ్చారు. అలాగే తనను మహిళా అధికారులే విచారించారు. ఛార్మీ రాకతో అక్కడ చాలా మంది గుమికూడారు. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన ఛార్మీ తన వెంట అడ్వకేట్ కావాలని, తన అనుమతి లేకుండా తల వెంట్రుకలు, గోర్లు, రక్తం నమూనాలను తీసుకోవద్దని కోరింది. కోర్టు అనుమతి ప్రకారం ఆమె అనుమతిస్తేనే రక్త నమూనాలను తీసుకోవచ్చంటున్నారు.
తొలుత నుండీ ఛార్మీ విచారణకు రావడానికి ఎందుకు భయపడుతోందనే వాదన గట్టిగా వినిపించింది. ఇవాళ పూర్తి విచారణ అనంతరం ఛార్మీ పాత్ర ఏ మేరకుంటుందనే దాని మీద స్పష్టత వస్తుంది. పూరీ వల్లే తనకు కెల్విన్ పరిచయమయ్యాడని చెప్పింది.
తనతో కలిసి ఈవెంట్లు చేసాం తప్ప తనకు అతనితో డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి లింకు లేదని చెబుతోంది. తను ఎవరివైనా కొత్త పేర్లు చెప్తే వాళ్ళను కూడా విచారించే అవకాశమున్నట్టు సిట్ అధికారులు అంటున్నారు. ఈ విచారణలో ఇప్పటివరకు అందరూ మగవారే హాజరయ్యారు. ఇప్పుడు ఛార్మీ తర్వాత మిగిలింది ముమైత్ ఖాన్ వంతు. తను బిగ్ బాస్ షోలో బిజీగా వుంది.
చూడాలి మరి ఛార్మీలా తను కూడా సస్పెన్సును వీడి తప్పకుండా సిట్ విచారణకు హాజరౌతుండొచ్చు !