SIT has issued notices to five persons in MLA purchase case
mictv telugu

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఐదుగురికి సిట్ నోటీసులు

November 25, 2022

SIT has issued notices to five persons in MLA purchase case

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్.. శుక్రవారం మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. ఈ సారి హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని స్పష్టంగా హెచ్చరించింది. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్ తో పాటు సిబ్బంది శరత్, ప్రశాంత్, విమల్, ప్రతాపన్ కి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది.

జగ్గుస్వామికి రెండు సార్లు నోటీసులిచ్చినా దర్యాప్తుకు సహకరించకపోవడంతో సిబ్బందికి నోటీసులిచ్చినట్టు సమాచారం. ఇక ముగ్గురు ప్రధాన నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గతంలో ఇచ్చిన రిమాండ్ గడువు ముగియడంతో కోర్టు తాజాగా వచ్చే నెల 9 వరకు రిమాండ్ ని పొడగించింది. అటు సిట్ విచారణ కొనసాగుతోంది. నందకుమార్ భార్య చిత్రలేఖ, న్యాయవాదులు ప్రతాప్ గౌడ్, శ్రీనివాస్ లు విచారణకు హాజరయ్యారు. నిందితులతో వీరికున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై కూపీ లాగుతున్నారు.