ఓ వైపు విచారణ...మరోవైపు అవగాహన...! - MicTv.in - Telugu News
mictv telugu

ఓ వైపు విచారణ…మరోవైపు అవగాహన…!

July 27, 2017

విచారణ….!

డ్రగ్స్ మహమ్మారి…కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా ఏ ఛానల్ లో చూసినా ఇదే వార్త.సినీ పరిశ్రమలో కొంతమందికి ఈ డ్రగ్స్ తో సంబంధం ఉన్నందని తేల్చిన సిట్ అధికారులు..ఇప్పుడు ఒక్కొక్కరి విచారిస్తున్నారు.అక్కడ అధికారులు ఏం అడిగారు.. వీళ్లేం చెప్పారో..అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి….కొందరు సెలెబ్రిటీలైతె అసలు ఈ డ్రగ్స్ కేసులో మమ్మల్ని అనవసరంగా ఇరికించారు,మాకేం సంబంధం లేదు అని చెబుతుంటే..ఇంకొందరేమో తెలంగాణ సర్కారు సిని ఇండస్ట్రీపై కక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తుంది అని చెబుతున్నారు.విచారణ జరిపే అధికారులకు డ్రగ్స్ ముఠానుంచి బెదిరింపు కాల్స్…

అవగాగాహన…!

మరో వైపు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈనెల 30 నాడు “ఆంటీ డ్రగ్ వాక్”  కేబిఆర్ పార్కులో  ఓ కార్యక్రమం నిర్వహిస్తారట,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావ్ సార్ రావాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షులు శివాజీరాజా,జనరల్ సెక్రెటరీ నరేష్ కోరారట.సినిమా ఇండస్ట్రి లో ప్రత్యేకంగా ఎవరిపైనా కక్ష సాధింపు చేయడం లేదని…డ్రగ్ ఫ్రీ సిటి లక్ష్యంగా సినిమా పరిశ్రమ కూడా సహకరిస్తూ అంటీ డ్రగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అని మంత్రి  పద్మారావ్ అన్నారట.మాదక ద్రవాల వాడకంను ఉక్కుపాదంతో అణిచివేసి వాటి బారిన పడుతున్న యువతి యువకులను కాపాడి బంగారు తెలంగాణకు బాటలు వేస్తాం అని కూడా మంత్రి అన్నారట.

అసలు పరిష్కారం…. ఏం చేస్తే బాగుంటుంది..!

ఈవిచారణలు… అవగాహనలు ఎన్ని చేసినా  వాడెటోళ్లు వాడక మానరు,సప్లై జేశెటోళ్లు చెయ్యకా మానరు.అసలు ఎక్కడో వేరే దేశంలో తయారైన ఈమాదక ద్రవ్యాలు మనకాడికి ఎలా వస్తున్నాయి,ఎవరు తీసుకొస్తున్నారు,అటు యువత,ఇటు సినీ ఇండస్ట్రీలో వాళ్లు, పెద్ద పెద్ద బడా బాబులు డ్రగ్స్ కు బానిసలుగా అవడానికి కారణం ఎవరు,అని ఇంతకు మునుపే గట్టిగా ఈ డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపితే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు,డ్రగ్స్ అనే మహమ్మారి ఆఖరికి స్కూల్ పిల్లల వరకూ చేరేది కాదు,చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు…డ్రగ్స్ దందా ఇంతగా విస్తరించడానికి  కారణం ఎవరు?వాళ్లకు సాయం చేసిందెవరు?ఎవరిదీ నిర్లక్ష్యం?ఇప్పటికైనా మించిపోయింది లేదు సార్లు…పబ్బులు డిస్కోలకు వెళ్లిన యువతని డ్రగ్స్ అనే మత్తుకు బానిసలను చేస్తున్న బద్మాష్ గాళ్ల తాట తీయండి,గల్లీ గల్లీ జల్లెడ వట్టి  డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉన్న ఎవ్వలినైనా తీస్కపొయ్యి లోపటెయ్యున్రు, ముఖ్యంగా గీ డ్రగ్స్ అసలు ఏడినుంచి వస్తున్నయనే దానిమీద ఎక్కో దృష్టి పెడితే…అప్పుడు డ్రగ్స్ మహమ్మారి శాశ్వతంగా మననుంచి దూరమవుతుంది.లేకపోతే మూడు విచారణలు ఆరు అవగాహన సదస్సులే తప్ప….డ్రగ్ వైరస్ ను తరిమి కొట్టడం కష్టం అవుతుంది.