బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కి సిట్ నోటీసులు.. రాకపోతే అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కి సిట్ నోటీసులు.. రాకపోతే అరెస్ట్

November 18, 2022

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ తన దూకుడు పెంచింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సిట్ ఆఫీసుకు రావాలని అందులో సూచించారు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని అధికారులు నోటీసులో స్పష్టం చేశారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు మొయినాబాద్ ఫాంహౌస్ లో కొందరు వ్యక్తులు సంప్రదించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ మారితే ఒక్కొక్కరికి వంద కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని తెలిపారు.

ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కి చెప్పడంతో ఆయన అప్రమత్తమై ఆడియో, వీడియో ఆధారాలు తెలివిగా సంపాదించారు. ఈ కేసులో వీడియోలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక మరో కీలక వ్యక్తి తుషార్ కోసం ప్రయత్నిస్తున్నారు.