Home > Featured > టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం

SIT officials arrested another accused in TSPSC paper leak case

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఇప్పటివరకు సిట్ పోలీసులు 43 మందిని అరెస్ట్ చేయగా.. ఇప్పుడు వరంగల్ కు చెందిన విద్యుత్ శాఖ డీఈ రవి కిషోర్ పేరు వెలుగులోకి వచ్చింది. అయన కనుసన్నల్లో ఏఈ క్వశ్చన్ పేపర్ చేతులు మారినట్లు తెలుస్తుంది. రవి కిషోర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ కోచింగ్ సెంటర్లో టీచర్ గా పనిచేస్తు.. అభ్యర్థులతో పరిచయం పెంచుకుని దాదాపు 20 మందికి క్వశ్చన్ పేపర్ అమ్మినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో ఆ కోచింగ్ సెంటర్ లో టాప్ మార్కులు సాధించిన వాళ్ల వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. కాగా, పేపర్ లీక్ కేసులో గురువారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కు చేరగా.. అరెస్ట్ అయిన వాళ్ల సంఖ్య 42కు చేరింది.

Updated : 28 May 2023 10:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top