సీత కూతురు పెళ్ళి వేడుకను చూడండి.. - MicTv.in - Telugu News
mictv telugu

సీత కూతురు పెళ్ళి వేడుకను చూడండి..

March 8, 2018

తెలుగుతోపాటు పలు దక్షిణాది చిత్రాల్లో నటించిన గుర్తింపు తెచ్చుకున్న నటి సీత. ఆమె, తమిళనటుడు పార్తిబన్‌ల సంతానం కీర్తన. కీర్తన కూడా నటే. ‘అమృత’ చిత్రంలో బాలనటిగా సత్తా చాటిన కీర్తన తర్వాత సినిమాలకు దూరమైంది. కీర్తన పెళ్లి గురువారం చెన్నైలో ఘనంగా జరిగింది.

దర్శకుడు అక్షయ్ అక్కినేనిని ఆమె పెళ్లాడింది. అక్షయ్.. సినిమాల ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తనయుడు. కీర్తన, అక్షయ్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు.

వీరి పెళ్లికి టాలీవుడ్, కోలీవుడ్ ల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, జ్యోతిక, ప్రభుదేవా తదితరులు సందడి చేశారు. సీత, పార్తిబన్ విడిపోయిన సంగతి తెలిసిందే.