సీత కాకపోతే శూర్పణఖ అని పెట్టాలా?: తేజ - MicTv.in - Telugu News
mictv telugu

సీత కాకపోతే శూర్పణఖ అని పెట్టాలా?: తేజ

May 23, 2019

‘నా సినిమాకు సీత కాకపోతే శూర్పణఖ అని పేరు పెట్టాలా? నేను పేరు మార్చను.. ఎవరు అడ్డు వస్తారో చూస్తా’ అని ఘాటుగా సమాధానం ఇచ్చారు దర్శకుడు తేజ. తన దర్శకత్వంలో వస్తున్న ‘సీత’ సినిమా టైటిల్ మార్చాలని.. సినిమా తమకు ముందుగా చూపించాలని కొందరి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెల్సిందే. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పేరును అస్సలు మార్చనని స్పష్టంచేశారు. తాను ఎవ్వరికీ సినిమా చూపించనని.. 24నాడు అందరూ థియేటర్లో సినిమా చూడాలని అన్నారు. ఎవరు ఆపుతారో చూస్తానని తెలిపారు.

కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటిస్తుండగా సోనూసూద్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ ఇచ్చేసింది. దీంతో తేజ సినిమాను విడుదల చేసే పనిలో పడ్డారు.