‘మహర్షి’ చూసి నా కూతురు ఏడ్చేసింది.. మహేశ్ బాబు   - MicTv.in - Telugu News
mictv telugu

‘మహర్షి’ చూసి నా కూతురు ఏడ్చేసింది.. మహేశ్ బాబు  

May 18, 2019

మహర్షి సినిమాతో తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని సూపర్ స్టార్ మహేశ్ బాబు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన మహర్షి సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత కొడుకు గౌతమ్, కూతురు సితార రియాక్షన్ ఏంటని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మహేశ్ సమాధానమిస్తూ.. సినిమా చూసిన వెంటనే తన కూతురు సితార కన్నీరు పెట్టుకుందని, కొడుకు గౌతమ్ పరుగెత్తుకొచ్చి నాకు హై-ఫై ఇచ్చాడని పేర్కొన్నాడు. తన పిల్లలు సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని తెలిపాడు.

sitara crying after maharshi movie watch.. super star mahesh babu

ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. ‘మహర్షి సినిమాను చూసి నా కూతురు సితార ఏడ్చేసింది. తను ఎదిగిపోయింది, అన్నీ తెలుస్తున్నాయి. సినిమా చూసిన తర్వాత గౌతమ్‌ నాకు హై-ఫై ఇచ్చాడు. వాళ్లిద్దరూ చాలా సంతోషపడ్డారు. ‘మహర్షి’ నన్ను కూడా మార్చేసింది. రెండేళ్ల క్రితం నేను వేరు, ఇవాళ మీ ముందు ఉన్న నేను వేరు. నా మూలాలతో నేను కనెక్ట్‌ అవడానికి ఈ సినిమా నాకు తోడ్పడింది. ఇకపై ఏడాదికి ఒక్కసారి అయినా..  కుటుంబంతో కలిసి పల్లెటూరికి వెళ్తాను’ అని మహేశ్‌ బాబు పేర్కొన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ తెరకెక్కించిన సినిమాను ప్రేక్షకులు ఎంతగానో నచ్చింది.