Home > Featured > ఓటీటీలోకి 'సీతారామం'..ఈ నెల నుంచే స్ట్రీమింగ్

ఓటీటీలోకి 'సీతారామం'..ఈ నెల నుంచే స్ట్రీమింగ్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథనాయకుడుగా, మృణాల్ ఠాకూర్ కథనాయికగా టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన తాజా చిత్రం 'సీతారామం'. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో సీతారామం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ఫ్రేమ్' శుభవార్తను చెప్పింది.

"అమెజాన్ ఫ్రేమ్'లో సీతారామం సినిమా ఈ నెల 9 నుంచి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది" అని కాసేపటిక్రితమే ప్రకటించింది. ఇక, సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో నటి రష్మిక మందన, సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్నా సినిమాస్ ఈ సినిమాను నిర్మించింది. ఇటీవలే ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేశారు.

"ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ అధికారి రామ్ (దుల్కర్ సల్మాన్) మద్రాస్ రెజిమెంట్లో పనిచేస్తుంటాడు. మానవత్వం ఉన్న వ్యక్తి. అనాథ అయిన రామ్ కశ్మీర్‌లో ప్రాణాలు ఎదురొడ్డి దేశం కోసం పోరాటం చేస్తుంటాడు. ఒక మిషన్ తర్వాత..అతడు, అతడి బృందం పేరు మార్మోగిపోతుంది. ఆల్ ఇండియా రేడియోలో తానొక అనాథ అని చెప్పినప్పట్నుంచీ అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామహాలక్ష్మి (మృణాల్ ఠాకూర్) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంతకీ ఈ సీతామహాలక్ష్మి ఎవరు? అనాథ అయిన రామ్ కు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెని కలుసుకునేందుకని వచ్చిన రామ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది కథ."

Updated : 6 Sep 2022 2:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top