మహేశ్ బాబుతో కలిసి స్టెప్పులేసిన సితార.. ప్రోమో అదుర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

మహేశ్ బాబుతో కలిసి స్టెప్పులేసిన సితార.. ప్రోమో అదుర్స్

March 19, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారి వారి పాట’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విడుదలై అభిమానులను అలరించింది. అంతేకాకుంగా ఇటీవలే ఈ సినిమాలోని మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పాట మంచి టాక్‌తో అభిమానులను ఆనందింపజేస్తూ దూసుకుపోతుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుంది. ఎప్పుడెప్పుడు మహేశ్ బాబు చెప్పే డైలాగ్స్ విని కేరింతలు కొట్టాలని ఆయన అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి శనివారం రెండవ పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. పెన్నీ అంటూ సాగె ఈ పూర్తి పాటను ఈనెల 20న విడుదల చేయనున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ఈ పాట ప్రోమోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటలో మహేష్ బాబు ముద్దుల తనయ సితార కూడా కనిపించి ఆకట్టుకుంది. మొదటిసారి సితార బిగ్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఇక ఈపాట వెస్ట్రన్ స్టైల్‌లో క్యాచీగా ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మేకర్స్ మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.