రైలు ఇంజన్ కింద కుర్చోని.. 200 కి.మీ.లు ప్రయాణం - MicTv.in - Telugu News
mictv telugu

రైలు ఇంజన్ కింద కుర్చోని.. 200 కి.మీ.లు ప్రయాణం

June 7, 2022

బీహార్‌ రాష్ట్రంలో ఓ వ్యక్తి రైలు కింద కుర్చుని రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన సంఘటన కలకలం రేపింది. గాయ రైల్వేస్టేషన్ నుంచి వారణాసికి బయలుదేరాల్సిన బుద్ద పూర్ణిమ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై వచ్చి ఆగింది. రైలు డ్రైవర్ వారణాసికి రైలు బయలుదేరాల్సిన సమయం 10 నిమిషాలు ఉండడంతో వాటర్ బాటిల్ కోసం కిందకు దిగాడు. అంతలోనే రైలు కింద నుంచి ఓ వ్యక్తి తనకు దాహంగా ఉందని, వెంటనే నీళ్లు ఇవ్వండి అంటూ అరుపులు, కేకలు వేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

దాంతో ఆ రైలు డ్రైవర్ రైల్వేశాఖ పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. జాగ్రత్తంగా ఆ వ్యక్తిని రైలు కింద నుంచి పైకి లేపి, నీళ్లను తాగించారు. ఆ తర్వాత స్టేషన్ నుంచి ఆ వ్యక్తి పారిపోయాడు. అయితే, ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని, రైలు మొదటగా ఎక్కడా ప్రారంభమైందో, ఆ స్థలంలోనే రైలు కిందకు వెళ్లి అక్కడ కుర్చున్నాడని పోలీసులు తెలియజేశారు.

మరోపక్క ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వ్యక్తి ఎప్పుడు రైలు ఎక్కాడు? అంత దూరం ఎలా కుర్చున్నాడు? ఎలా ప్రయాణం చేశాడు? అంటూ నెటిజన్స్ తెగ చర్చించకుంటున్నారు. మరికొంతమంది ఏది ఏమైనప్పటికి ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు గాని, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డాడని, అతనికి ఇంకా ఈ లోకంలో జీవించే అవకాశం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.