నటుడు శివాజీ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని ఉద్యమిస్తున్న నటుడు శివాజీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కాషాయ దళం 2019 ఎన్నికల్లో దక్షిణ భారతంలో గెలవడానికి ఆపరేషన్ ద్రవిడ పేరుతో భారీ విధ్వసం సృష్టించేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ఏపీలో విధ్వసం సృష్టించి, టీడీపీని దెబ్బతీసి, ఉపరాష్ర్ర్టపతి వెంకయ్య నాయుడిని సీఎం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని పరోక్షంగా సూచించారు. దీనిపై విలేకర్లతో, తర్వాత ఓ టీవీ చానల్లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.
రూ. 4,800 కోట్లతో యాక్షన్ ప్లాన్..
దక్షిణాదిని చేజిక్కించుకోవడానికి బీజేపీ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తుందని, దీనికోసం అమిత్ షా ఆపరేషన్ ద్రవిడ పేరుతో భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని శివాజీ చెప్పారు. విధ్వంసాలు సృష్టించడానికి రూ. 4,800 కోట్లు సమకూర్చుకున్నారని వెల్లడించారు. కొంత మొత్తాన్ని ఇప్పటికే తరలించారన్నారు. ‘నాకు ఈ విషయం తనకు 2017 సెప్టెంబర్‌లోనే తెలిసింది. కర్ణాటకలో ఆపరేషన్ కుమార, తమిళనాడు, కేరళల్లో ఆపరేషన్ రావణ నిర్వహిస్తారు. ఈ వివరాలను కర్ణాటక నుంచి జాతీయ పార్టీకి అనుబంధంగా చేస్తున్న వ్యక్తి నాకు చెప్పాడు. ఆపరేషన్ వివరాలన్నీ నా పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయి. శత్రువులకు శత్రువులను మిత్రులుగా మార్చుకుని టార్గెట్ పార్టీని దెబ్బకొట్టేలా సాగుతుంది. ఆ పెన్ డ్రైవ్‌ను విలేకర్లకు ఇస్తాను’ అని తెలిపారు.
పథకాన్ని ఒక రాజ్యంగ శక్తి ఈ ఆపరేషన్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజల అనైక్యతను బీజేపీ పావుగా వాడుకుంటుంది. టీడీపీ పార్టీకి దెబ్బతీసి, ఒక కీలక నాయకుణ్ని జైలుకు పంపుతుంది. ఒక యువ నాయకుడిని కేంద్రమంత్రిని చేస్తుంది. చివరికి బీజేపీకే చెందిన, అత్యున్నత స్థానంలో ఉన్న సీనియర్ తెలుగు నేతను సీఎంను చేస్తుంది..’ అని చెప్పారు. అయితే వ్యక్తుల పేర్లను వెల్లడించలేదు. కానీ అత్యున్నత స్థానంలో ఉన్న బీజేపీ సీనియర్ నేత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే. రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన్ను సీఎంను సాధ్యం చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్నా తలెత్తుతోంది.
అయితే శివాజీ ఆరోపణలకు ఆధారాలేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. శివాజీ కేవలం జనం దృష్టిని ఆకర్షించేందుకు సంచలన ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే త్వరగా బయటపెట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.