అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఈవో ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఈవో ఆత్మహత్య

November 24, 2019

Sivalayam temple eo anita 

కృష్ణా జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం దైద శివాలయం కార్యనిర్వహణ అధికారి అనిత ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా పొందుగల వద్ద ఆమె కృష్ణానదిలో దూకారు. గుర్తుతెలియని మృతదేహంగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.

గురజాలలోని మరో ఆలయానికి కూడా ఈవోగా పనిచేస్తున్న అనిత ఇటీవల అవినీతి ఆరోపణలు రావడోంత సస్పెండ్ అయ్యారు. భర్తతో విభేదాల వల్ల ఆమె విడిగా ఉంటున్నారు. సస్పెన్షన్ తోపాటు, వ్యక్తిగత  సమస్యల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉంటుందని భావిస్తున్నారు. శివాలయానికి సంబంధించిన లెక్కల్లో తేడాలు రావడంతో ఆమెను ఈ నెల 18న సస్పెండ్ చేశారు.