Sivamurthy Muruga built a modern bathroom
mictv telugu

బాలికలపై అత్యాచారం కోసం స్పెషల్ బాత్రూం.. మఠాధిపతి ఘోరం

September 20, 2022

మైనర్ బాలికలపై అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన కర్ణాటకలోని లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ కేసులో సోమవారం దర్యాప్తు పూర్తయింది. ఈ క్రమంలో పోలీసులకు మఠంలో జరిగిన విస్తుపోయే విషయాలు తెలిశాయి. శివమూర్తి మురుగ పదేళ్ల నుంచి మఠంలోని బాలికలపై అత్యాచారం చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. బాధితుల్లో కొందరికి అబార్షన్లు చేశారని, ఈయన పెట్టే బాధలు తట్టుకోలేక కొందరు బాలికలు మఠం విడిచి పోయారని తెలుస్తోంది. అనాథ పిల్లలను చేరదీసి ‘బసవ’ అని పిలుస్తూ వారితో లైంగిక వాంఛలు తీర్చుకునేవాడని విచారణలో తేలింది. బాలికలను ఒప్పించడం కోసం అబ్బాయిలతో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడని, సహకరించని వారిని వేధింపులకు గురి చేసేవాడని తెలిసింది. శారీరక అవసరాల కోసం ‘ఆనంద యాత్ర’ పేరుతో థాయిలాండ్‌ కూడా వెళ్లి వచ్చాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే బాలికలపై అత్యాచారం చేయడానికి వీలుగా అత్యాధునిక బాత్రూం నిర్మించుకున్నాడని, అక్కడే లైంగిక దాడికి పాల్పడేవాడని భావిస్తున్నారు. కాగా, శివమూర్తి మురుగ ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లా జైలులో ఉన్నారు.