పొగ తాగనివారికి 6 రోజులు అదనపు సెలవులు  - MicTv.in - Telugu News
mictv telugu

పొగ తాగనివారికి 6 రోజులు అదనపు సెలవులు 

December 2, 2019

smokers 01

కేన్సర్‌తోపాటు నానా రోగాలకు కారణమవుతున్న ధూమపానాన్ని నియంత్రించడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. భారీ జరిమానాలు కూడా విధిస్తున్నాయి. చూస్తూనే కక్కొచ్చే భయంకరమైన చిత్రాలను సిగరెట్ పెట్టెలపై అచ్చేయిస్తున్నాయి. అయినా పొగరాయుళ్లు గుప్పుగుప్పుమని కొడుతూనే ఉన్నారు. తాగే వారికే కాకుండా, వారి పక్కన ఉన్న వారికీ హాని చేసే ఈ దరటువాటును కట్టడి చేయడానికి జపాన్ లోని ఓ కంపెన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 

పొగ తాగని తమ ఉద్యోగులకు ఏడాదిలో ఆరు రోజులు అదనపు సెలవులు ఇస్తామని టోక్యోకు చెందిన మార్కెటింగ్ కంపెనీ పియాలా తెలిపింది. పని మధ్యలో పొగ కోసం వెళ్తుండడం వల్ల పనులు సరిగ్గా సాగడం లేదని ఓ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీ ఆఫీసు 29వ అంతస్తులో ఉంది. దమ్మురాయుళ్లు ఓ పీక కాల్చడానికి బేస్ మెంటుకు వెళ్లాల్సి వస్తోంది. 29 అంతస్తులు దిగి, మళ్లీ ఎక్కి వచ్చేలోపు పనులు సజావుగా సాగడం లేదు. దిగడానికి, ఎక్కి రావడానికి 15 నిమిషాలు పడుతుండడంతో కంపెనీ 6 రోజుల అదనపు సెలవుల నిర్ణయం తీసుకుంది.