మెంతి కూర అని గంజాయిని అంటగట్టారు.. తిన్న ఫ్యామిలీ ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

మెంతి కూర అని గంజాయిని అంటగట్టారు.. తిన్న ఫ్యామిలీ ఇలా

July 1, 2020

nvgnvbhnmnh

కొన్నిసార్లు సరదా పనులు మనుషుల ప్రాణాల మీదకు తెస్తాయి. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోనూ ఒకటి జరిగింది. మెంతి కూరకు, గంజాయికీ తేడా తెలియని ఓ కుటుంబం తీవ్ర అవస్థతకు గురైంది. బావ ఇచ్చాడు కదా అని దాన్ని వండుకొని తిన్న వారంతా ఆస్పత్రి పాలయ్యారు. ఆట పట్టించాలని చేసిన పని కాస్తా వాళ్ల ప్రాణాల మీదకు తేవడంతో అతడు కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. బాధితులందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

 కన్నౌజ్ జిల్లా మియాగంజ్ గ్రామానికి చెందిన  ఓం ప్ర‌కాష్‌ గంజాయిని మెంతిగా చెప్పి తన బావ మరిదికి సరదాగా ఇచ్చాడు. ఈ విషయం తెలియని నితేష్ ఇంటికి తెచ్చి దానితో కూర‌చేయమన్నాడు. అంతా కలిసి తిన్న కొంత సేపటికి మత్తు ఎక్కి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్క‌రుగా స్పృహ‌త‌ప్పి ప‌డిపోడిపోవడంతో స్థానికులు విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గంజాయిని అంటగట్టిన ఓం ప్రకాశ్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది. సరదాగా కావాలనే చేశాడా లేక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.