నందమూరి జయకృష్ణకు జైలుశిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

నందమూరి జయకృష్ణకు జైలుశిక్ష

September 6, 2017

మాజీ సీఎం నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు నందమూరి జయకృష్ణకు ఓ లీజు కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడింది. రూ.25 లక్షల జరిమానా కూడా విధిస్తూ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్‌ మూడో మెట్రోపాలిటన్  కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. నగరం నడిబొడ్డున్న ఉన్న అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్‌ క్యాంటీన్‌, పార్కింగ్‌ లీజు వివాదంలో కేసులో ఆయన దోషింగా తేలారు. లీజు లావాదేవీలో జయకృష్ణ ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో బాధితులు కోర్టుకెక్కారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు తప్పు ఆయనేదని తేల్చి శిక్ష విధించింది. తీర్పుపై నందమూరి కుటుంబం నుంచి ఇంతవరకు స్పందన రాలేదు.