Six New judges took oath today in Telangana High Court
mictv telugu

తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జీలు ప్రమాణస్వీకారం

August 16, 2022

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కొత్త జడ్జీలు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, భీమపాక నగేశ్‌, పుల్లా కార్తీక్‌, కాజా శరత్‌ న్యాయమూర్తులుగా, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. న్యాయవాదుల కోటాలో ఆరుగురు న్యాయమూర్తులు నియామకమైన విషయం తెలిసిందే. హైకోర్టు ఏర్పాటైనప్పుడు జడ్జిల సంఖ్య 24 ఉండగా.. ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఆరుగురు ప్రమాణస్వీకారం చేయగా.. మరో ఎనిమిది జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.