తెలంగాణలో కరోనా కల్లోలం..ఆరుగురు రోగుల మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా కల్లోలం..ఆరుగురు రోగుల మృతి 

March 31, 2020

Six People Corona Victims in Telangana

తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీని కారణంగా ఆరుగురు మరణించారు. ఒకే రోజు ఇంత మంది మరణించడం అందరిని భయాందోళనకు గురి చేస్తోంది. వెంటనే ప్రభుత్వం అప్పమత్తమైంది కరోనా అనుమానితులకు పరీక్షల వేగం పెంచింది. మరణించిన వారంతా ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిగా ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

వీరంతా ఈ నెల 13 నుంచి 15 వరకు మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా పేర్కొన్నారు.   ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, నిజామాబాద్ గద్వాలలో చెరొకరు మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7కు చేరింది. కాగా మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికే ప్రధానంగా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది. దీంతో అక్కడికి వెళ్లినవారిని గుర్తించి ఐసోలేషన్‌కు పంపించే కార్యక్రమం చేపట్టారు. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 77కు చేరింది. అందులో 14 మందిని డిశ్చార్జ్ చేయడంతో బాధితులసంఖ్య 61గా నమోదైంది. మరణాల సంఖ్య 7కు చేరింది.దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1251కు చేరుకుంది.

మర్కజ్‌కు ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారు వెంటనే స్వయంగా సమాచారం ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించింది. వారికి ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తుందని పేర్కొంది. మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనలకు దాదాపు 75 దేశాల నుంచి వచ్చారని గుర్తించారు. వారి కారణంగా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. మరోవైపు నిజామూద్దీన్ వెళ్లి వస్తున్నవారిని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బార్డర్ల వద్దే ఆపేసి ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు.