SIX PEOPLE DIED AFTER SWIMMING HYDERABAD
mictv telugu

హైదరాబాద్‌లో విషాదం..ఈతకు దిగి ఆరుగురు మృతి

November 5, 2022

హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మల్కారం చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మునిగిపోతున్న వారిని కాపాడేందుకు వెళ్లిన ఓ వ్యక్తి కూడా మరణించాడు. మృతులంతా అంబర్‌పేట్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. ఓ ఫంక్షన్‌కు వెళ్ళిన వీరంతా ఈత కొట్టేందుకు చెరువులో దిగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సాయంతో చెరువులో నుంచి మృతదేహాలను వెలికితీసారు.