ఉద్యోగం నుంచి తీసేశారని కాల్పులు..ఆరుగురి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగం నుంచి తీసేశారని కాల్పులు..ఆరుగురి మృతి

February 27, 2020

fb cv b

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన నిందితుడితో సహా ఆరుగురు మృతి చెందారు. మిల్‌వాకీ నగరంలోని మెల్సన్‌ కూర్స్‌ బీర్ల కంపెనీలో బుధవారం సాయంత్రం 6గంటలకు ఈ ఘటన జరిగింది. 51 ఏళ్ల మెల్సన్‌ కూర్స్‌ కంపెనీలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు.

ఘటన తర్వాత మెల్సన్‌ కూర్స్‌ కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెల్సన్‌ కూర్స్‌‌ను సంస్థ మాజీ ఉద్యోగిగా గుర్తించారు. కొంత కాలం క్రితం అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తీసేశారు. దీంతో సంస్థపై కోపం పెంచుకున్నాడు. సంస్థలో పనిచేస్తున్న మరో ఉద్యోగి ఐడీ కార్డు దొంగిలించి సంస్థలోకి చొరబడి కాల్పులకు పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతాపం తెలిపారు.