బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ అంటేనే మనం భయపడి చస్తాం. తోలేవాడు జామ్మని తోలినా కూర్చున్నోళ్ల గుండెలు గుభిళ్లుమంటాయి. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితిల్లో ట్రిపుల్ రైడింగ్‌కు ఓకే చెప్పేస్తాం. బైక్‌పై ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఐదుగురు కాదు, ఏకంగా ఆరుమంది ఎక్కేస్తే? అందులో ఐదుగురు పెద్దలు, టీనేజీర్లు కూడా ఉంటే? కూర్చోడానికి స్థలం లేక ఆరోవాడు ఐదో మనిషి భుజాలపై ఎక్కి కూర్చుంటే?
ఇదిగో ఈ వీడియోలా ఉంటుంది.
Heights of Fukra Panti 6 people on one scooter @CPMumbaiPolice @MTPHereToHelp pic.twitter.com/ovy6NlXw7l
— Ramandeep Singh Hora (@HoraRamandeep) May 22, 2022
ముంబైలోని అంధేరీ వెస్ట్ బజారులో ఎవరి కెమెరా కంటికో చిక్కిన సీన్ ఇది. రెడ్ లైట్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన హోండా యాక్టివా స్కూటర్‌పై మొత్తం ఆరుగురు ప్రయాణించారు. వీరిలో ఐదుగురు యువకులు, ఒక బాలుడు ఉన్నారు. ఆరో వాడు కూర్చోడానికి జాగా లేక ఐదోవాడి భుజాలపై కూర్చున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ముంబై పోలీసులకు కూడా ట్యాగ్ అయి ఉంది. బండ్లు గుద్దుకుని చనిపోవడం పక్కనబెడితే ఇలా నడిపితే గ్యారంటీగా పైకి పోతారని నెటిజన్లు అంటున్నారు.