గాడ్సే పుట్టిన రోజు వేడుకలు… హిందూ మహాసభ కార్యకర్తల అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

గాడ్సే పుట్టిన రోజు వేడుకలు… హిందూ మహాసభ కార్యకర్తల అరెస్ట్

May 21, 2019

Six Surat Hindu Mahasabha men held for celebrating Godse birthday.

నాథురాం గాడ్సే వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఓ ప్రచార సభలో కమల్ హాసన్ ప్రసంగిస్తూ..స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది నాథురాం గాడ్సే అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం అయ్యాయి. తాజాగా ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలు మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సే పుట్టిన రోజు వేడుకలను జరిపారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన పోలీసుల దృష్టికి రావడంతో వారిని అరెస్ట్‌ చేశారు.

సూరత్‌‌కు చెందిన హిందూ మహాసభ కార్యకర్తలు స్థానిక దేవాలయంలో నాథురాం గాడ్సే జన్మదినమైన మే 19న జయంతి వేడుకలు జరిపారు. ఇక్కడి లింబాయత్‌ ప్రాంతంలోని సూర్యముఖి హనుమాన్‌ దేవాలయంలో, గాడ్సే ఫోటో చుట్టూ దీపాలు వెలిగించి, పూజలు చేశారు. తరువాత మిఠాయిలు పంచుకుని, భజన చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో, వారు కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.