పోలీసులు ఆశ వదులుకున్న కేసును ఈ బుడ్డోడు ఛేదించాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులు ఆశ వదులుకున్న కేసును ఈ బుడ్డోడు ఛేదించాడు.. 

May 22, 2020

six year old boy solves robbery case

పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఈ అమెరికా బుడ్డోడికి చక్కగా సరిపోతుంది. ఎందుకంటే కేవలం ఆరేళ్ళ వయసులోనే ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్న ఓ దొంగతనం కేసును ఛేదించాడు. వివరాల్లోకి వెళితే..కరోలినాలో కొన్నేళ్ల క్రితం ఓ దొంగతనం జరిగింది. దీనిపై ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు తీసుకుని కొని రోజులు దొంగ కోసం వెతికారు. కానీ, దొంగ దొరకలేదు. దీంతో ఆ కేసు అలాగే ఉండిపోయింది.

తాజాగా లాక్‌డౌన్ లో కాలక్షేపం చేయడానికి జాన్స్ ఐలాండ్‌కు చెందిన నాక్స్ బ్రేవర్ అనే కుర్రాడు తన ఫ్యామిలీతో కలిసి మాగ్నెట్ ఫిషింగ్‌కు వెళ్లాడు. విట్నీ సరస్సులో గాలం వేయగా నీళ్ల అడుగు భాగాన ఓ వస్తువు తగిలింది. అది బరువుగా ఉండడంతో ఇతరుల సహాయం దాన్ని బయటికి తీశారు. ఆ పెట్టెను తెరవగా అందులో నగలు, ఖరీదైన వస్తువులు, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్ ఉన్నాయి. దీంతో పిల్లాడి తండ్రి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ పెట్టెను స్వాధీనం చేసుకుని పెండింగ్ లో ఉన్న దొంగతనము కేసులను తిరగేసాగారు. ఈ పెట్టెలో ఉన్న వస్తువుల గురించి ఫిర్యాదులో రాసిన మహిళను పిలిపించారు. పెట్టె ఆమెదేనని నిర్దారణకు వచ్చి ఆమెకు అందించారు. ఎనిమిదేళ్ల క్రితం ఆ మహిళా ఈ పెట్టెను పోగొట్టుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఆ పెట్టె తిరిగి దక్కడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. దీనికి కారణమైన పిల్లోడిని ఆమె మనసారా హత్తుకుని ధన్యవాదాలు తెలిపింది.