స్కూలు ప్రవేశాల్లో వయసు నిబంధన మార్చిన ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

స్కూలు ప్రవేశాల్లో వయసు నిబంధన మార్చిన ప్రభుత్వం

July 28, 2022

ఒకటో తరగతిలో ప్రవేశాలకు కర్ణాటక ప్రభుత్వం వయసు నిబంధన మార్చింది. ఇప్పటివరకు ఐదేళ్ల ఐదు నెలల వయసు ఉంటేనే ఒకటో తరగతిలో జాయిన్ చేసేవారు. దానిని ప్రభుత్వం మరో ఏడు నెలలకు పెంచింది. అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు 6 ఏళ్లు నిండితేనే ప్రవేశాలకు అర్హత లభిస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు మానసికంగా, శారీరకంగా సన్నద్ధం కాకముందే స్కూల్లో జాయిన్ చేస్తున్నారని, దీనివల్ల వారిపై చెడు ప్రభావం పడుతోందని ప్రభుత్వ వాదన. ఈ కొత్త రూల్ పట్ల ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అయింది. కొన్ని పాఠశాలలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాయి. మరికొందరు ఆందోళనకు లోనవుతున్నారు. ‘మా బాబు జులైలో పుట్టాడు. అతడిని ఒకటో తరగతిలో అనుమతిస్తారా? లేదా మళ్లీ యూకేజీ చదవమంటారా? అని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. మరికొందరేమో ఈ నిబంధన వల్ల అనవసరంగా ఓ ఏడాది వేస్ట్ అవుతుందని బాధపడుతున్నారు.