పేకాట పాపమ్మలు.. పొదల్లో వేస్కో ఆకుల్ - MicTv.in - Telugu News
mictv telugu

పేకాట పాపమ్మలు.. పొదల్లో వేస్కో ఆకుల్

October 16, 2020

six zomen caught gambling behind bushes in Ajmer.jp

రాజస్థాన్‌లో సీన్ రివర్స్ అయింది. పేకాట ముఠా అనగానే సామాన్యంగా పురుషులు గుర్తుకువస్తారు. కానీ, రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఆరుగురు మహిళలు పొదల చాటున పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. వారితో పాటు ఓ యువకుడు కూడా అరెస్టు అయ్యాడు. 

నగర శివారులోని వైశాలి నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వారి వద్ద నుంచి రూ. 37,000 విలువైన టోకెన్లు, రూ. 13,650 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న మహిళలను నంకి(50), నీతు(57), సోనా(49), సంగీత(52), రుక్మణి(48), మాయ(45)గా గుర్తించాడు. ఆ యువకుడిని సన్నీ(33)గా గుర్తించాడు. నిందితులపై జూదం చట్టం కింద కేసు నమోదు చేశారు. మహిళలు పేకాట ఆడుతూ పట్టుపడడం ఆశ్చర్యం కలిగించిందని పోలీసులు తెలిపారు.