ఒక్కరోజే 68 వేల కరోనా పాజిటివ్ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కరోజే 68 వేల కరోనా పాజిటివ్ కేసులు

July 11, 2020

bvcb

అమెరికాలో కరోనా వైరస్ విజ్రింభిస్తోంది. అక్కడ గత మూడు రోజులుగా సగటున 65 వేల కేసులు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నిన్న ఒకేరోజు దేశవ్యాప్తంగా 68 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 32,91,786 కి చేరింది. ఇప్పటివరకు అమెరికాలో 1,36,671 కరోనా మరణాలు సంభవించాయి. 

దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 14,60,495 మంది కోలుకోగా, 16,94,620 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అమెరికాలోని అలస్కా, జార్జియా, ఇడాహో, ఒహియో, ఉటా, లూసియానా, మోంటానా, విస్కాన్సిన్‌ రాష్ర్టాల్లో రికార్డుస్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,26,16,579 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… 5,62,039 కరోనా మరణాలు సంభవించాయి.