బయటపడ్డ 282 మంది భారత సిపాయిల అస్థిపంజరాలు - MicTv.in - Telugu News
mictv telugu

బయటపడ్డ 282 మంది భారత సిపాయిల అస్థిపంజరాలు

May 11, 2022

స్వాతంత్య్ర తొలి సంగ్రామం 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు లభించాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో అజ్నాలాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో వీటిని కనుకొన్నట్లు పంజాబ్‌ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జేఎస్‌ సెహ్రావత్‌ తెలిపారు. అక్కడ లభించిన నాణేలు, పతకాలు, డీఎన్‌యే అధ్యయనం, ఆంత్రోపోలాజికల్ ఎలిమెంటల్ అనాలిసిస్, రేడియో-కార్బన్ డేటింగ్ వంటి వాటి పరిశీలనల ద్వారా తెలుస్తున్నదని వివరించారు.

డిసెంబరు 1856లో బ్రిటిష్ పాలకులు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తుపాకీని తీసుకొచ్చి, తూటాల చివర ఆవు, పంది కొవ్వు పూయడంతో సిపాయిలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆవు హిందువులకు పవిత్రం, పంది ముస్లింలకు నిషేధం. తూటాలను నోటితో కొరకడానికి భారతీయ సిపాయిలు నిరాకరించి, బ్రిటిషర్లకు ఎదురుతిరిగారు. వారికి వ్యతిరేకంగా తిరుబాటు చేసిన సైనికులను బ్రిటీష్‌ పాలకులు చంపించారు. వారి మృతదేహాలను బావిలో పడేశారని ప్రొఫెసర్ తెలిపారు.