స్కింప్పింగ్లో కొందరు చాలా రకాలుగా చేస్తారు. వేగంగా అస్సలు ఆపుకోకుండా కూడా వంద వరకు చేస్తారు. కొందరు రివర్స్‌లో చేసి అబ్బుర పరుస్తుంటారు. అయితే అంతర్జాతీయ స్థాయి జంప్ రోప్ అథ్లెట్ జోరావర్ సింగ్ తాడాటలో కొత్త విధానాన్ని పరిచయం చేశాడు. ఇలాంటి తాడాటను బహుశా మీరెప్పుడూ చూసి ఉండరు. జోరావర్ సింగ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి వివిధ రూపాలు, స్టంట్స్‌తో చేసిన స్కిప్పింగ్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరిని భుజాల మీద కూర్చుండబెట్టుకున్నారు. ఇద్దరూ చెరో రెండు తాళ్లు పట్టుకుని ఆడసాగారు. వీరు వాళ్లను ఎత్తుకుని ఏమాత్రం తొణకుండా చక్కగా తాడాట ఆడారు.
అనంతరం వారిని కిందకు దింపి మరో విన్యాసం చేశారు. వారు రెండు తాళ్లను ఆడిస్తుంటే ఎక్కడా మిస్ అవకుండా కాళ్ల మీద, చేతుల మీద జంప్ చేసి అబ్బుర పరిచారు. వారి స్కిప్పింగ్ చూస్తున్న జనాలు ముక్కుమీద వేలు వేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. కాగా, కరోనా సమయంలో జిమ్ సెంటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో చాలామంది జిమ్‌లకు వెళ్లకుండా ఇళ్లల్లోనే చిన్నచిన్న వ్యాయామాలు చేసుకున్నారు. అలా ఇంట్లో మనం సులువుగా చేయదగిన వ్యాయామం స్కిప్పింగ్ అవడంతో చాలా మంది స్కిప్పింగ్ చేశారు.
https://www.instagram.com/reel/CFjdlBxHzet/?utm_source=ig_embed