ఆకాశ నగరం.. 38 వేల కోట్లతో నిర్మిస్తున్న సౌదీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆకాశ నగరం.. 38 వేల కోట్లతో నిర్మిస్తున్న సౌదీ

June 2, 2022

సౌదీ అరేబియా ప్రభుత్వం తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరుగాంచిన బుర్జ్ ఖలీఫాను తలదన్నేలా సౌదీ అరేబియాలో త్వరలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారీ జంట కట్టడాలను నిర్మించనున్నామని తెలిపింది. ఈ కట్టడాల కోసం ఇప్పటికే సౌదీ అరేబియా అధికారులు ప్రణాళికలు కూడా రచిస్తోన్నట్లు పేర్కొంది. ఈ భవనాలను.. దగ్గర నుంచి చూసినా, దూరం నుంచి చూసినా ఆకాశాన్ని తాకేలా ఉంటాయని, 500 మీటర్లపైగా ఎత్తులో ఉంటాయని తెలిపింది.

“కట్టడాల ఎత్తులో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. వెడల్పు మాత్రం ఊహించనంత ఉండనుంది. తుదిరూపు ఇంజినీరింగ్ నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందిస్తాం” అని సౌదీ అధికారులు తెలిపారు. ఈ నిర్మాణాలకు సౌదీ ప్రభుత్వం భారీగానే ఖర్చు పెట్టనుంది. అధికారుల అంచనా ప్రకారం.. నిర్మాణ వ్యయం 500 కోట్ల డాలర్ల (సూమారు రూ. 38 వేల కోట్లు)తో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌బిన్ సల్మాన్ కలల నగరమైన నియోమ్‌లో నిర్మించనున్నామని, అత్యాధునిక హంగులతో స్పార్ వార్స్‌లోని వకాండా తరహాలో నిర్మితమవుతున్న కృత్రిమ స్మార్ట్ నగరంగా, ఎర్రసముద్ర తీరంలో 170 కిలోమీటర్ల పొడవున కడుతున్న ఈ నగరానికి ఈ జంట మహా భవనాలు ఆకర్షణ తేనున్నాయని సౌదీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరోపక్క ఈ కట్టడాల నిర్మాణం గనుక పూర్తి అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద భవనాలుగా చరిత్రకెక్కుతాయని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన భవనంగా ఉన్న బుర్జ్ ఖలీఫా ఎత్తు 500 మీటర్లు. ఈ 500 మీటర్లను క్రాస్ చేస్తూ, సౌదీ ప్రభుత్వం ఎత్తైన కట్టడాలను నిర్మిస్తామని ప్రకటించడంతో ప్రపంచమంతా తెగ చర్చించుకుంటోంది. చమురు ధరల పెరుగుదలతో వచ్చిన ఆదాయాన్ని ఏం చేసుకోవాలో తెలీక సౌదీ ఇలాంటి పనికిి పూనుకుంటోందని సమాచారం.