ఆకాశంలో పురుషాంగం.. అమెరికా నేవీ సీరియస్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆకాశంలో పురుషాంగం.. అమెరికా నేవీ సీరియస్..

May 16, 2019

పని లేకపోతే ఏదో ఒక పని కల్పించుకోవాలి. టైమ్ వేస్ట్ చేయకూడదు. కానీ ఎలాంటి పని చేయాలో నిర్ణయించుకునే ముందు ఒళ్లు జాగ్రత్త పెట్టుకోవాలి. లేకపోతే ‘ఆకాశంలో పురుషాంగం’ సృష్టించిన పైలట్ల మాదిరి చిక్కుల్లో పడక తప్పదు.

విషయంలోకి వెళ్తే.. నింగిలో అంగం మిస్టరీని అమెరికా నేవీ ఛేదించింది. అది తమ పైలట్లు చిలిపితనంతో విమానాల పొగ ద్వారా గీసిన బూతు చిత్రమని, అందుకు తాము హృదయపూర్వక క్షమాపణ కోరుతున్నామని పేర్కొంది. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక కూడా బయటికొచ్చింది. పైలట్లకు బాగా చీవాట్లు పడ్డాయి.

Woman in UP dies after explosion in her mouth during treatment...

2017లో వాషింగ్టన్ గగనతలంపై ఆ బూతుబొమ్మ కనిపించింది. చూసిన జనం బిక్కచచ్చిపోయారు. కొందరు ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టుకున్నారు. తర్వాత నేవీ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. ఇద్దరు ట్రైనీ పైలట్లు E/A-18 గ్రావ్లర్ యుద్ధ విమానాలు నడుపుతూ ‘పొద్దుపోక’ ఈ చిత్రాన్ని గీశారు. ‘‘బ్రో, మనం ఆకాశంలో అతిపెద్ద అంగాన్ని గీద్దాం. నేను నా విమానాన్ని అటు తీసుకెళ్లి ఇటు తిప్పుతాను.. నువ్వు కూడా అటు వెళ్లి ఇటురా.. ’’ మాట్లాడుకుని ఎంచక్కా తప్పుల్లేకుండా గీశారు. తర్వాత విమానాల్లోంచి తమ ఘనకార్యాన్ని ఫొటో కూడా తీసుకున్నారు. అయితే వారి ఖర్మ మరోలా ఉండడంతో పొగ వెంటనే చెదిరిపోక చాలాసేపు నింగిలో ఉండిపోయింది. నింగిలో ఈ అఘాయిత్యం పనులేంటని ఓ మహిళ అంగాన్ని ఫోటో తీసి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు సదరు చిలిపి పైలట్ల మధ్య జరిగిన సంభాషణ రికార్డులను బయటికి తీశారు.

‘నువ్వు భలే గీస్తావ్.. కానీ బొమ్మలో వృషణాలు మరీ చిన్నవిగా ఉన్నాయి గురూ. అది మరీ ..గా ఉంది.. డ్యూడ్ యూఆర్ సో ఫన్నీ..’’ వగైరా బూతు మాటలన్నీ బయటికొచ్చాయి.