హైదరాబాదులో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్లు, పది గ్రాముల బంగారం రూ. 600 పెరిగి రూ. 47,950కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం, పది గ్రాముల ధర రూ. 640 పెరిగింది. దాంతో తులం బంగారం రూ. 52,310 కి చేరింది. వెండి ధర కిలోకు రూ. 900 పెరిగి రూ. 72,800కి చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.