స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - MicTv.in - Telugu News
mictv telugu

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

April 12, 2022

gold

అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం, వెండి ధరలలో హెచ్చు తగ్గులు వస్తుంటాయి. అవి బాగుంటేనే ధరలు స్థిరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే కేజీకి రూ. 600 పెరిగింది. ఫలితంగా కేజీ వెండి ధర రూ. 72,900 కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 400 పెరిగి రూ. 49,000 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 430 పెరిగి రూ. 53,450కి చేరింది. కాగా, 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు గత ఆరు రోజుల్లో రూ. 1200 పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1310 పెరిగింది. వెండి కేజీ ధర రూ. 2000 పెరిగింది.